CM Comments
-
పూటకో మాట మాట్లాడితే ఎలా పవన్?
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులను చూస్తే జాలేస్తుంది. జనసైనికుల ప్రతినిధిగా సీఎం అవుతాడనుకున్న పవన్... కాపు సామాజిక వర్గ శ్రేయోభిలాషులను అవమానించేలా మాట్లాడుతున్నా చప్పట్లు కొట్టారంటే ఆశ్చర్యం వేస్తుంది. సినిమా హీరోలపై కొందరిలో వెర్రి అభిమానం ఉంటుందని అంటారు. హేతుబద్దత, మంచి, చెడు విశ్లేషణ కొరవడతాయని అంటారు. మంగళగిరిలో జనసేన సమావేశంలో జరిగిన ఈ సన్నివేశం చూసిన తర్వాత అది నిజమేనేమో అనిపిస్తుంది. తమిళనాడులో పార్టీని స్థాపించి రెండేళ్లలోనే ముఖ్యమంత్రైన విజయ్‌తో తనను పోల్చడంపై పవన్ కళ్యాణ్‌కు అసహనంగా ఉండవచ్చు. దానిపై నేరుగా వివరణ ఇచ్చి ఉండవచ్చు. అలా కాకుండా ‘‘ఊళ్లో పెళ్లికి..’’ అన్న సామెత కాస్త మార్చి ఊళ్లో పెళ్లవుతుంటే పిల్లలు అటూ, ఇటూ తిరుగుతూ హడావుడి చేస్తుంటారని సర్దుకున్నారు. అయినా ఈ వ్యాఖ్యపై సోషల్ మీడియాలో విస్తారంగా కథనాలు వచ్చేశాయి. అభిమానులను కుక్కలతో ఎలా పోల్చుతారంటూ ప్రశ్నలు సంధించారు. నిజానికి ఈ సామెతను ప్రస్తావించినప్పుడు జన సైనికులంతా అవమాన భారంతో కుంగిపోయి ఉండాలి. కాని పలువురు చప్పట్లు కొట్టారు. అంటే వారికి ఆయన ఉద్దేశం అర్థం కాలేదన్నమాట. ఇంత అమాయకులు కనుకే పవన్ కళ్యాణ్ ఇన్నేళ్లుగా వారిని మభ్యపెట్టగలుగుతున్నారా?2008 నుంచి రాజకీయాల్లో ఉన్న పవన్ 2014లో సొంత పార్టీ పెట్టినప్పటి తరువాత కూడా... ఆయన ఎన్ని మాటలు మార్చాడో అందరికీ తెలుసు. అబద్ధాలు చెప్పడం, మాటమార్చడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రికార్డులు కూడా ఈయన బద్ధలు కొట్టి ఉంటారు. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని అభిమానులు, కాపు సామాజిక వర్గం గట్టిగా కోరుకుంది. గత ఎన్నికల సమయంలో పవన్ రెండేళ్లపాటు సీఎం పదవి, కనీసం యాభై సీట్ల డిమాండ్‌ను చంద్రబాబు ముందు పెట్టి ఉండాల్సిందని చాలామంది అప్పట్లో సూచించారు కూడా. కానీ ఆయన వీటిని పట్టించుకోలేదు. ఈవీఎంల మాయో, లేక జనం ఓట్లు వేశారో కాని, కూటమి అధికారంలోకి వచ్చాక ఆయన ధోరణి పూర్తిగా మారిపోయింది. తనకు మద్దతిస్తే కాపుల నుంచి సీఎం అయి చూపిస్తానని ప్రగల్భాలు పలికిన పవన్ టీడీపీకి పదిహేనేళ్లపాటు మోస్తానని చెబుతుండడం ఆ వర్గాలను నిరాశ పరుస్తోంది. టీడీపీని మోయడానికి జనసేన పేరుతో పార్టీ పెట్టడం దేనికి అని అభిమానులే ప్రశ్నిస్తున్నారు.తమిళనాడులో విజయ్ సొంత సిద్ధాంతం, వైఖరితో ఎన్నికలలో ఒంటరిగా పోటీచేసి విజయం సాధించారు. కానీ పవన్‌లో ఈ చిత్తశుద్ది ఎన్నడూ వ్యక్తం కాలేదు. 2014లో పార్టీ పెట్టినప్పుడే పోటీ చేయకుండా చంద్రబాబుకు మద్దతు ఇచ్చారు. అది ఎలాంటి వ్యూహం అవుతుంది? తొలుత చెగువేరా వెంట ఆ తరువాత తర్వాత మోడీ అంటే... కమ్యూనిజం నుంచి సనాతనానికి మారిన చరిత్ర పవన్‌ది. అవసరమైతే సీఎం పదవినైనా అయినా వదలుకుంటాను తప్ప కుల, మత రాజకీయాలు చేయను అని స్పష్టంగా చెప్పిన చరిత్ర విజయ్‌ది. పవన్ కళ్యాణ్ నిత్యం తెలుగుదేశం తరపున అనేక అసత్యాలను ప్రచారం చేయడానికి కృషి చేస్తున్నారని కొందరు విమర్శిస్తుంటారు. తనకు కుల భావన లేదని ఒకసారి, కాపులైనా తనకు ఓటు వేయరా అని మరోసారి, అమరావతి కుల రాజధాని అవుతోందని ఇంకోసారి, తాను ఎప్పుడూ అమరావతికి మద్దతు ఇచ్చామని వేరొకసారి ఇలా అనేక అంశాలలో మాటలు మార్చి రికార్డు సృష్టించారు. ఆంధ్రప్రదేశ్‌లో 30 వేల మంది మహిళలు మిస్సింగ్ అంటూ చెప్పిన పచ్చి అబద్దం గురించి ఈనాటికి వివరణ ఇవ్వలేకపోయారు. ఇలా అనేక సార్లు మాట మార్చడానికి వెనుకాడలేదు. వేరే పార్టీవారి కోసం విజయ్ పనిచేయాల్సిన పని లేదు. అబద్దాలు చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. 2019లో ఒంటరిగా పోటీ చేశానని పవన్ చెప్పడం అసత్యమా?కాదా? అన్నది ఆలోచించుకోవాలి. రెండు చోట్ల ఓడిపోయింది నిజమే కావచ్చు.కాని దానిపై ఆత్మపరిశీలన చేసుకున్నారా? అప్పట్లో లక్నో వరకు వెళ్లి బీఎస్పీ అధినేత్రి మాయావతిని కలిసి ఎన్నికల పొత్తు కోరిన సంగతి ఆయన మర్చిపోయారేమో! ఆ పార్టీతోపాటు సీపీఐ, సీపీఎంలతో జట్టు కట్టిన విషయం ఆయనకు జ్ఞప్తికి లేదనుకోవాలా? ఓటమి తర్వాత వెంటనే బీజేపీతో పొత్తు కోసం డిల్లీ వెళ్లారా? లేదా? ఇదంతా డబుల్ గేమ్ కాదా? పొత్తు పెట్టుకోవడం తప్పుకాదు.కాని తనకేదో సిద్దాంతం ఉన్నట్లు నమ్మబలకడమే బాగోలేదు. బీజేపీతో కలిసి పోటీచేయడం ఉపయుక్తమని ఈయన ఇచ్చిన సలహాను విజయ్ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో విజయ్ ఏకంగా సీఎం అవడం పవన్‌కు బాగా చికాకుగా మారింది. పవన్ కళ్యాణ్ కూడా ఒంటరిగా రాజకీయం చేసి ఉంటే ఎప్పటికైనా సీఎం అయ్యే అవకాశం ఉండేదని ఆయనకు మద్దతు ఇచ్చే వర్గాలు భావిస్తున్నాయి.అదే విషయం ఆయనకు చెవిలో చెబితే కోపం వచ్చినట్లు ఉంది.తాను సీఎం అవ్వడానికి పార్టీ పెట్టలేదని చెప్పడం తనను తాను మోసం చేసుకోవడం కాదా? పలుమార్లు తాను సీఎం అయి చూపిస్తానని అన్నారా? లేదా? సమాజంలో మార్పు కోసం పార్టీ పెట్టానని పవన్ ఇప్పుడు చెబుతున్నారు. దానిని ఎవరైనా నమ్ముతారా? పోనీ ఏమిటి అయన తీసుకువచ్చిన మార్పు. సమాజం సంగతి అటు ఉంచి, ఆయనలో ఏమైనా మార్పు వచ్చిందా అన్నది ఆలోచించుకోవాలి! 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేశ్ ల గురించి ఎన్ని మాటలు అన్నారు. ఆ తర్వాత ఇప్పుడేమని పొగుడుతున్నారు? దానిపై వివరణ ఇచ్చారా? మహిళలపై కూటమి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న అఘాయిత్యాలపై ఎన్నడైనా నోరు తెరిచారా?ఎవరిదాకానో ఎందుకు? జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఒక యువతి చేసిన ఆరోపణల గురించి స్పందించారా? శ్రీకాళహస్తిలో సొంత పార్టీ మహిళా నేత టీడీపీ ఎమ్మెల్యేపై చెప్పిన సంగతులేమిటి? దానిపై ఎక్కడైనా మాట్లాడారా? వైసీపీపై రాజకీయ విమర్శలు చేయవచ్చు. కాని అలాకాకుండా టీడీపీ నేతల మాదిరి అసత్యమైన వ్యక్తిగత దూషణలకు దిగడం సమర్థనీయం కాదు. చిత్రం ఏమిటంటే వంగవీటి రంగాను ఎందుకు కాపాడుకోలేకపోయారని ఆయన మద్దతుదారులను పవన్ ప్రశ్నించడం చూసి విస్తుపోయారు. రంగాను హత్య చేసిన వారితో, ముద్రగడ కుటుంబాన్ని వేధించిన వారితో, అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి విధ్వంసం సృష్టించిన వారితో అంటకాగుతూ రంగా హత్యపై కాపులనే ప్రశ్నిస్తున్నారని పవన్ కళ్యాణ్‌ను పలువురు ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ గందరగోళంగా మాట్లాడుతున్నారని చాలామంది అంటుంటారు.కాని అది నిజం కాకపోవచ్చని, టీడీపీ కుతంత్రాల రాజకీయం బాగా వంట పట్టించుకుని అదే దారిలో సాగితేనే ప్రజలను మభ్య పెట్టవచ్చన్న ఉద్దేశంతో పవన్ ఉన్నారేమో అన్న అనుమానాన్ని కొందరు విశ్లేషకులు వ్యక్తం చేస్తుంటారు. ఏదో రకంగా తంటాలు పడి రాజకీయాలలో పదవులు పొందవచ్చేమో కాని, ప్రజలలో విశ్వసనీయత, గౌరవ స్థానం పొందడానికి చిత్తశుద్ది,లక్ష్య శుద్ది ఉండాలి. అవమానించినా చప్పట్లు కొట్టే అభిమానులు ఉండడం చూస్తే పవన్ కళ్యాణ్ అంతవరకు అదృష్టవంతుడే అని చెప్పాలేమో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సీఎం వ్యాఖ్యలపై తమ్మినేని ఫైర్
మల్యాల: గుండుసూదులు గుచ్చే పార్టీ అంటూ సీపీఎంను సీఎం కేసీఆర్ ఎద్దేవా చేయటాన్ని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్రంగా ఖండించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల పక్షాన పోరాడుతున్న తమవి దిక్కుమాలిన ఉద్యమాలు అని వ్యాఖ్యానించటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ హుంకరింపులకు బెదిరేది లేదని, న్యాయం జరిగే దాకా పోరాటాలను ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో విపక్షాల నిరసనల మధ్య తెలంగాణ భూసేకరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం పొందినట్లు ప్రకటించుకోవటం రైతులకు, పేదలకు అన్యాయం చేయటమేనని తెలిపారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా 29న రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీలు ఇతర నిరసన కార్యక్రమాలను చేపట్టాలని తమ్మినేని వీరభద్రం ప్రజలకు పిలుపునిచ్చారు. -
హోదాపై బాబు వ్యాఖ్యలు బాధాకరం
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉదయభాను విజయవాడ (అజిత్‌సింగ్‌నగర్) : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఓ హక్కుగా భావించి పోరాడుతున్న విద్యార్థులను జైళ్లకు పంపుతానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనడం బాధాకరమని, సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడడం సరైన పద్ధతి కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను పేర్కొన్నారు. గాంధీనగర్‌లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోతే తన రక్తం ఉడికిపోతుందని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ‘ప్యాకేజీ’ చాలని మాటమార్చడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తమ ప్యాకేజీ కమీషన్ల కోసం 5 కోట్ల మంది ఆంధ్రుల మనోభావాలను దెబ్బతీÄñæ¬ద్దని విజ్ఞప్తి చేశారు. నాడు ‘క్విట్ ఇండియా’తో బ్రిటీష్ వారిని ఎలా తరిమికొట్టారో.. నేడు చంద్రబాబును కూడా రాష్ట్ర ప్రజలు ‘క్విట్ ఏపీ’తో తరిమికొట్టే పరిస్థితి వస్తుందన్నారు. ఎంతమందిని జైల్లో పెడతారు.. నిజంగా అలా జైల్లో పెట్టాలనుకుంటే ప్రత్యేక హోదా కోసం పోరాడేవారితో రాష్ట్రంలో జైళ్లు సరిపోవని పేర్కొన్నారు. రెండేళ్ల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాలనలో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. మొన్నటికి మొన్న చింతమనేని ప్రభాకర్ తహసీల్దారును కొట్టి బెదిరిస్తే.. ఇప్పుడు వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ రైల్వే కాంట్రాక్టర్లను బెదిరించడం సిగ్గుచేటని విమర్శించారు. అవినీతి పాలనకు అంతం పలికేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. మంత్రి పీతల సుజాత ఇంట్లో పది లక్షల రూపాయల సూట్ కేసును పోలీసులు పట్టుకున్నా కేసు కట్టలేని పరిస్థితి నెలకొందని దుయ్యబట్టారు. -
గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది
తెలంగాణ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన చంద్రబాబు * ఉమ్మడి రాజధాని, సెక్షన్-8పై గవర్నర్దే అధికారం * కానీ ఆయన క్రియాశీలకంగా వ్యవహరించడంలేదు * పదేళ్ల తర్వాతే హైదరాబాద్ తెలంగాణ రాజధాని అవుతుంది * ఆత్మగౌరవంపై ఎవరితోనూ రాజీపడే ప్రసక్తిలేదు * పార్టీలు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం కొరవడింది * టీడీపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో సీఎం వ్యాఖ్యలు సాక్షి, విజయవాడ బ్యూరో: ‘‘హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే సంగతి మరచిపోయి తెలంగాణ ప్రభుత్వం ప్రతీదానికి గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది. సెక్షన్-8 ప్రకారం ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారం ఉంటుంది. కానీ ఈ అంశాలపై గవర్నర్ క్రియాశీలకంగా వ్యవహరించడంలేదు. అయినా మన మంత్రులు, ఎంపీలు, అధికారులపై తెలంగాణ ప్రభుత్వం పెత్తనం ఎలా చేస్తుంది? పదేళ్ల తరువాతే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని అవుతుందనే విషయం గుర్తించాలి. ఉద్యోగుల భద్రత, ఆంధ్రుల ఆత్మగౌరవంపై ఎవరితోనూ రాజీపడే ప్రసక్తిలేదు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టీఆర్ఎస్ సర్కారుపై విమర్శల వర్షం కురిపించారు. విజయవాడ శేషసాయి కల్యాణమండపంలో శనివారం జరిగిన టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. షెడ్యూల్ 9, 10 పరిధిలో ఉన్న సంస్థలపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదన్నారు. ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి పెద్దగా తీసుకెళ్లలేకపోయామని, చాలా చోట్ల ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని, పార్టీని సమన్వయం చేసుకోలేకపోతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. నేతల గైర్హాజరు... బాబు అసంతృప్తి విస్తృతస్థాయి సమావేశానికి కీలక నేతలు సైతం గైర్హాజరయ్యారు. సమావేశం ప్రారంభమైన గంటకుపైగా మీటింగ్ హాలులో కుర్చీలు ఖాళీగా ఉండటంపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆహ్వానితులు కచ్చితంగా టైమ్‌కు రాకపోతే ఎలా? అని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి శుక్రవారం జరిగిన కలెక్టర్ల సదస్సుకు, శనివారం పార్టీ సమావేశానికి కూడా హాజరుకాకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. మంత్రులు పరిటాల సునీత, గంటా శ్రీనివాసరావుతోపాటు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం సమావేశానికి హాజరుకాలేదు.ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు యనమల రామకృష్ణుడు, కేంద్ర మంత్రులు సుజనాచౌదరి, పూసపాటి అశోక్‌గజపతిరాజు, పార్టీ చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు మాట్లాడారు. జర్నలిస్టులకు పెద్ద ఆసరా: సీఎం రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులతో సమాన సౌకర్యాలు ఉండే హెల్త్‌కార్డు జర్నలిస్టులకు పెద్ద ఆసరాగా ఉంటుందని సీఎం చంద్రబాబు చెప్పారు.జర్నలిస్టులకు హెల్త్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవాడలో శనివారం రాత్రి ఆయన ప్రారంభించారు. 14వేలమంది జర్నలిస్టుల్లో 8,321మందికి హెల్త్‌కార్డులను జారీ చేస్తున్నామని చెప్పారు. మినీ సెక్రటేరియట్‌కు రూ.3 లక్షలు ముఖ్యమంత్రి చంద్రబాబు జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 24లో అద్దెకుంటున్న భవనంలోనే ఓ భాగంలో (డోర్ నెం.8-2-293/82/ఎ/369-బి) మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేసేందుకు లీజు అగ్రిమెంటు కింద ప్రభుత్వం రూ.3 లక్షలు మంజూరు చేసింది. మంత్రివర్గ సమావేశం 3కి వాయిదా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జూలై 3కు వాయిదా పడింది. తొలుత ఈ సమావేశా న్ని జూలై 2న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముస్లింలకు చంద్రన్న రంజాన్ తోఫా సాక్షి, విజయవాడ బ్యూరో: రంజాన్ సం దర్బంగా రాష్ట్రంలోని ముస్లింలకు చం ద్ర న్న రంజాన్ తోఫా ( కానుక)ను ఇస్తున్న ట్టు చంద్రబాబు ప్రకటిచారు. శనివా రం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల కార్యక్రమం లో సీఎం ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ కానుకలో రెండు కిలోల పంచదార, కిలో సేమియా, ఐదు కిలోల ఆటా (గోధుమ పిండి) పంపిణీ చేస్తామన్నారు.


