తరచూ ఎన్నికలు జరిగే దేశంలో ఒక రాజకీయ పార్టీ ఏళ్లకు ఏళ్లు వరుసగా విజయాలు సాధించడం అతిగొప్ప విషయమని, అది ప్రజల ఆకాంక్షలకు అభివ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయదుందుభి మోగించిన దరిమిలా.. మరోసారి యావత్ దేశానికి అభివృద్ధి సందేశం వెళ్లిందని ఆయన అభిప్రాయపడ్డారు.