ధోని.. నా హెలికాప్టర్‌ షాట్లు చూడు! | Watch: Poonam Shares A Girl Video Of MS Dhoni's Helicopter Shots | Sakshi
Sakshi News home page

ధోని.. నా హెలికాప్టర్‌ షాట్లు చూడు!

Jun 4 2020 5:13 PM | Updated on Mar 21 2024 8:42 PM

ఆగ్రా: ప్రపంచ క్రికెట్‌లో భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని హెలికాప్టర్‌ షాట్లకు చాలా క్రేజ్‌ ఉంది. ఈ షాట్లను చాలా మంది క్రికెటర్లు ప్రయత్నించినా పెద్దగా సక్సెస్‌ అయిన దాఖలాలు లేవు. కొన్ని సందర్భాల్లో భారత ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా హెలికాప్టర్‌ షాట్లను కొట్టడం మనం చూశాం. అయితే ఒక బాలిక ధోని తరహాలో హెలికాప్టర్‌ షాట్లను కొట్టిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను భారత మహిళా క్రికెటర్‌ పూనమ్‌ యాదవ్‌ తన ట్వీటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. 

దీనికి ‘దిస్‌ ఈజ్‌ క్రేజీ’ అనే క్యాప్షన్‌ ఇచ్చిన పూనమ్‌.. ఎంఎస్‌ ధోనికి, సురేశ్‌ రైనా, బీసీసీఐలకు ట్యాగ్‌ చేశారు.ప్రస్తుతం కరోనా వైరస్‌ కారణంగా భారత్‌లోని క్రీడా ఈవెంట్లు ఇంకా పునరుద్ధరించలేదు. దాంతో క్రీడాకారులంతా తమ తమ ఇళ్లలోనే ఉంటూ సోషల్‌ మీడియాలో బిజీగా గడుపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న ఘటనలపై స్పందిస్తూ తమ అభిప్రాయాల్ని షేర్‌ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పూనమ్‌ యాదవ్‌కు ఈ వీడియో తారస పడగా దాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement