ప్రపంచంలోనే ఉత్తమ శబ్దం ఇది

ప్రపంచంలో అత్యంత వేగంగా పరుగెత్తే జంతువు చిరుత అని మనందరికి తెలుసు. జంతువులను వేటాడే క్రమంలో అది పరుగెత్తినట్లు మరే జంతువు పరుగెత్తలేదు. అయితే ఇంత వేగంగా పరుగెత్తే జంతువు నిషిదంగా ఉన్నప్పుడు శబ్దం ఎలా చేస్తుందో  అందరికి తెలియదు. ఇప్పుడు ఆ శబ్దం ఎలా ఉంటుందో ఈ వీడియో తెలియజేస్తుంది. దాని శబ్దం మీ చెవికి వినసొంపుగా ఉంటుంది.  దీన్ని ఆస్ట్రేలియాలో ఉన్న వైల్డ్ క్యాట్ కన్జర్వేషన్ సెంటర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

కేర్‌ టేకర్‌ ఓ అందమైన చిరుత గడ్డం నిమురుతూ ఉండగా, అది హాయిగా నిద్రపోతోంది. ఆ సమయంలో చిరుత నుంచి వచ్చి శబ్దం సంగీతం విన్నట్లుగా ఉంది. ఈ వీడియోను వైల్డ్‌ క్యాట్‌ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ ‘ప్రపంచంలోనే ఉత్తమైన శబ్దం ఇది’అని క్యాప్షన్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. గడ్డం నిమురుతూ ఉంటే చిరుత పొందిన శాంతికి నెటిజన్లను ఆకర్షిస్తుంది. ఇంతకంటే హాయిదనం ఏముంటుందంటూ కామెంట్లు చేస్తున్నారు.  

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top