ఆడపులి కోసం మగ పులుల భీకర పోరు

మాములుగా ఒక అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు కొట్టుకోవడం చూసుంటాం. కానీ రెండు మగ పులులు(అందులో అవి సోదరులు).. ఒక ఆడ పులి కోసం భీకర పోరుకు దిగిడం ఎప్పుడైనా చూశారా?. ఇలాంటి ఘటనే రాజస్తాన్‌లోని రణతంబోర్‌ జాతీయ పార్క్‌ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రణతంబోర్‌ షర్మిలి అనే అడపులికి సింగ్‌స్థ్‌(టీ57), రాకీ (టీ58) అనే రెండు మగ పులులు జన్మించాయి. ఇవి పెరిగి పెద్దవయ్యాయి. అయితే ఇటీవల ఈ రెండు కూడంగా క్రూరంగా ఒకదానిపై ఒకటి దాడికి యత్నించాయి. వాటి మధ్య గొడవ ప్రారంభం అవగానే ఓ ఆడపులి అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయింది. అయితే ఈ రెండు పులులు మాత్రం ఒకదానిపై మరోకటి తీవ్రంగా దాడి చేసుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ఐఎఫ్‌ఎస్‌ అధికారి ప్రవీణ్‌ కస్వాన్‌ బుధవారం తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు.

ఆ వీడియో కాస్త వైరల్‌గా మారిడంతో.. ఈ యుద్ధంలో ఎవరు గెలిచారని చెప్పాలంటూ ప్రవీణ్‌ను కోరారు. దీనిపై స్పందించిన ప్రవీణ్‌.. ‘ఈ యుద్ధంలో టీ57 గెలిచింది. ఈ యుద్ధంలో రెండింటికి కూడా ప్రమాదకర గాయాలు కాలేదు. అవి రెండు నూర్‌(టీ39) అనే ఆడపులి కోసం గొడవకు దిగాయి. రెండు మగ పులలు మధ్య గొడవ ప్రారంభం అక్కడి నుంచి వెళ్లిపోయిన ఆడపులే నూర్‌’ అని తెలిపారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Back to Top