ఆమె కంట్లో తేనెటీగలు.! | Doctors Discover 4 Bees Living Inside a Woman's Eye and Feeding on Her Tears | Sakshi
Sakshi News home page

ఆమె కంట్లో తేనెటీగలు.!

Apr 10 2019 4:06 PM | Updated on Mar 22 2024 11:16 AM

కంట్లో నలుసు పడితేనే అల్లాడిపోతాం. అలాంటిది తైవాన్‌కు చెందిన ఓ మహిళ కంట్లో  ఏకంగా తేనెటీగలు కాపురమే పెట్టేసాయి. కంటి నుంచి నీరు కారుతుండటం, కన్నువాయడంతో సదరు మహిళ ఆసుపత్రికి వెళ్లగా.. ఆమెను పరీక్షించిన డాక్టర్‌ అవాక్కయ్యాడు. ఆమె కంట్లో  నాలుగు తేనెటీగలు సజీవంగా ఉండటాన్ని గుర్తించాడు. వెంటనే వాటిని తొలిగించి ఆమె కంటికి చికిత్స చేశాడు. అయితే కంటిలో కీటకాలు వెళ్లడం, అవి సజీవంగా ఉండటం ప్రపంచంలోని తొలిసారని డాక్టర్‌ హాంగ్‌ చీ టింగ్‌ తెలిపారు. బాధిత మహిళైన ఎంఎస్‌ హీ తన బంధువుల సమాధి వద్ద ఉన్న కలుపు మొక్కలను ఏరివేస్తుండగా తేనెటీగలు ఆమెకే తెలియకుండా ఎడమ కన్నులోకి వెళ్లాయి. ఏదో చెత్తపడిందిలే అని కళ్లను కడుక్కున్న ఆమె అంతగా పట్టించుకోలేదు. 

కానీ మరుసటి రోజు కంటి నుంచి నీరు కారడం, ఎడమ కన్ను వాయడంతో ఆమె వెంటనే ఫూయిన్‌ యూనివర్సిటికి వెళ్లి పరీక్షలు చేయించుకుంది. ఆమెకు చికిత్స చేసిన డాక్టర్‌ హాంగ్‌ చీ టింగ్‌.. వాటిని తొలగించారు. ‘ ఆమె కంటిని మైక్రోస్కోప్‌తో పరీక్షించినప్పుడు నాకు తేనెటీగ కాళ్లు కనిపించాయి. వెంటనే నేను మైక్రోస్కాప్‌ సాయంతో మరింత లోతుగా చూశాను. అప్పుడు నాకు నాలుగు గండు చీమలు కదులుతుండటం కనిపించింది. కంటి పొర లోపల ఉన్న వాటిని తొలిగించాను’ అని డాక్టర్‌ మీడియాకు తెలిపారు. ఆమె కంటిని ఎక్కువగా నలపకపోవడం వలన కంటి చూపు కోల్పోయే ప్రమాదం నుంచి తప్పించుకుందని, ఐదురోజుల చికిత్స అనంతరం డిశ్చార్జ్‌ చేసినట్లు పేర్కొన్నారు. ఏది ఏమైనా ఈ వింత ఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement