కుక్‌ తీసిన ఏకైక వికెట్‌ అదే

ఇంగ్లండ్‌ మాజీ సారథి, స్టార్‌ బ్యాట్స్‌మన్‌ అలిస్టర్‌ కుక్‌ తన కెరీర్‌ చివరి మ్యాచ్‌కు ముహూర్తం ప్రకటించిన విషయం తెలిసిందే. టీమిండియాతో జరిగే  ఏ ఇతర ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌కు సాధ్యంకాని ఎన్నో రికార్డులు, మరెన్నో అవార్డులు అతని సొంతం. క్రీజులో నిలదొక్కుకుంటే చాలు బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ.. స్కోర్‌ బోర్డు పరిగెత్తించేవాడు. ఇక ఫీల్డింగ్‌లో కూడా చురుగ్గా ఉంటూ స్లిప్‌లో ఎన్నో మరుపురాని క్యాచ్‌లు అందుకున్నాడు. ఈ లెఫ్టాండ్‌ బ్యాట్స్‌మన్‌ బౌలింగ్‌ చేయడం చాలా అరుదు. అతను ఆడిన 160 టెస్టుల్లో 26,086 బంతులను ఎదుర్కొని 12254 పరుగుల చేయగా..  కేవలం 18 బంతులే బౌలింగ్‌ చేసి ఒక్క వికెట్‌ సాధించాడు. ఆ ఔట్‌ చేసింది కూడా టీమిండియా బౌలర్‌ ఇషాంత్‌ శర్మనే కావడం విశేషం.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top