పెద్దగా అంచనాలు లేకుండా వరల్డ్‌కప్ సమరానికి సిద్ధమైన వెస్టిండీస్ టోర్నీని ఘనంగా ఆరంభించింది. పాకిస్తాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించి శుభారంభం చేసింది. తొలుత పాకిస్తాన్‌ను కూల్చేసిన వెస్టిండీస్.. ఆపై గెలుపును సునాయాసంగా అందుకుంది. పాకిస్తాన్ నిర్దేశించిన 106 పరుగుల టార్గెట్‌ను విండీస్ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. విండీస్ ఓపెనర్ క్రిస్ గేల్(50; 34 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.