స్టీవ్ స్మిత్‌కు డబుల్ షాక్! | Steve Smith suspended and Bancroft handed three demerit points | Sakshi
Sakshi News home page

స్టీవ్ స్మిత్‌కు డబుల్ షాక్!

Mar 25 2018 7:55 PM | Updated on Mar 22 2024 11:07 AM

బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) డబుల్ షాకిచ్చింది. ఓ మ్యాచ్‌ నిషేధం విధిస్తూ ఐసీసీ చర్యలు తీసుకుంది. దీంతో పాటుగా మొత్తం మ్యాచ్‌ ఫీజును (100 శాతం) కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇక బాల్‌ ట్యాంపరింగ్‌కు యత్నించిన ఆసీస్‌ ఆటగాడు బెన్‌క్రాఫ్ట్‌కు మ్యాచ్‌ ఫీజులో 75 శాతం కోత విధిస్తూ.. మూడు డీమెరిట్‌ పాయింట్లు ఇచ్చింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో బెన్‌ క్రాఫ్ట్‌ ట్యాంపరింగ్‌కు యత్నించి టీవీ కెమెరాలకు అడ్డంగా దొరికిన విషయం తెలిసిందే. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement