జాతీయ గీతాన్ని ఆలపించిన పాక్‌ | Pakistan fans singing indias national anthem | Sakshi
Sakshi News home page

జాతీయ గీతాన్ని ఆలపించిన పాక్‌

Sep 21 2018 11:32 AM | Updated on Mar 22 2024 11:28 AM

ఆసియాకప్‌లో భాగంగా గత రెండు రోజుల క్రితం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌ను 162 పరుగులకే కట్టడి చేసి, ఆపై విజయాన్ని సునాయాసంగా అందుకుంది. అయితే మ్యాచ్‌ ఆరంభానికి ముందు ఇరు జట్ల సభ్యులు ఫీల్డ్‌లోకి వెళ్లిన తర్వాత తమ దేశాల జాతీయ గీతాన్ని ఆలపించారు.

కాగా, భారత జాతీయ గీతం రన్‌ అవుతున్న సందర్భంలో పాకిస్తాన్‌ ఫ్యాన్స్‌ సైతం అందుకు తమ శృతిని జత చేశారు. పలువరు పాక్‌ అభిమానులు నిలబడి మరీ భారత జాతీయ గీతాన్ని ఆలపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనిపైభారత జాతీయ పలువురు భారత నెటిజన్లు వారిని అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. మరొకవైపు దీనికి సంబంధించి వీడియో వైరల్‌గా మారింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement