కామన్వెల్త్‌ గేమ్స్‌లో మధుర క్షణం | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 8 2018 6:23 PM

ప్రేమ ఎప్పుడు, ఎక్కడ పుడుతుందో చెప్పలేం. ప్రేమను గెలుపించుకున్న ఆనందం ఒకరిదైతే.. తన మనసుకు నచ్చినవాడే ఎదురొచ్చి ప్రపోజ్‌ చేస్తే ఆ సంతోషమే వేరు. ప్రస్తుతం  అస్ట్రేలియాలో జరుగుతన్న కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఇలాంటి మధుర క్షణం చోటుచేసుకుంది. ఇంగ్లండ్‌ క్రీడాకారులు తమ సత్తా చాటుతూ పతకాల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. మరోవైపు ఆ దేశానికి చెందిన ఇద్దరు బాస్కెట్‌ బాల్‌ ప్లేయర్స్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌ను తమ జీవితాల్లో మరచిపోలేని వేడుకకు వేదికగా చేసుకున్నారు. బాస్కెట్‌ బాల్‌ పురుషుల జట్టుకు చెందిన జామెల్‌ అండర్సన్‌, ఆ దేశ బాస్కెట్‌ బాల్‌ మహిళల జట్టుకు చెందిన జార్జియా జోన్స్‌కి ప్రపోజ్‌ చేశాడు.

Advertisement
Advertisement