టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని అవమానించేందుకు ఇంగ్లండ్ క్రికెట్ ప్రేమికులు యత్నించారు. తొలిటెస్ట్ ఓటమి అనంతరం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీమిండియా అభిమానులు ఇంగ్లండ్ ఫ్యాన్స్‌పై ఫైర్ అవుతున్నారు. కోహ్లి అద్వితీయ ఆటతీరుతో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ జట్టు భారాన్ని మోశాడు. కానీ ఇతర బ్యాట్స్‌మెన్ షాట్ల ఎంపికలో తప్పిదాల వల్లే నెగ్గుతుందనుకున్న ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో చివరికి 31 పరుగుల తేడాతో కోహ్లి సేన ఓటమి పాలైంది. (శిఖరాన విరాట్)