శభాష్‌ హార్దిక్‌ | amla run out by hardik pandya excellent throw | Sakshi
Sakshi News home page

Jan 13 2018 8:33 PM | Updated on Mar 22 2024 11:03 AM

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆల్‌ రౌండర్‌ అద్బుతమైన ఫీల్డింగ్‌తో హార్దిక్‌ శభాష్‌ అనిపించాడు. మ్యాచ్‌పై సఫారీలు పట్టుబిగిస్తున్న వేళ హార్దిక్‌ ఒక అద్భుతమైన త్రో ద్వారా హాషీమ్‌ ఆమ్లా(82;153 బంతుల్లో 14 ఫోర్లు)ను రనౌట్‌ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఇన్నింగ్స్‌ 81 ఓవర్‌ను అందుకున్న హార్దిక్‌.. ఐదో బంతికి ఆమ్లాకు షాకిచ్చాడు. ఆ బంతిని క్రీజ్‌ దగ్గరగానే డిఫెన్స్‌ ఆడిన ఆమ్లా పరుగు కోసం యత్నించాడు. అయితే అంతే వేగంగా దూసుకొచ్చిన హార్దిక్‌ బంతిని అందుకున్న మరుక్షణమే నాన్‌ స్టైకింగ్‌ ఎండ్‌ వైపు వికెట్లను నేలకూల్చాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement