సింగపూర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు | TCSS 2018 Ugadi Celebrations held in Singapore | Sakshi
Sakshi News home page

Mar 20 2018 11:42 AM | Updated on Mar 22 2024 11:07 AM

తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (టీసీఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలు జరిగాయి. బుకిత్ పంజాంగ్ లోని శ్రీ మురుగన్ హిల్ ఆలయంలో పంచాంగ శ్రవణం చేశారు. శ్రీ విళంబి నామ సంవత్సరం లో అందరికి మంచి జరగాలని సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకల్లో సుమారు 400 మంది ప్రవాసి తెలంగాణ వాసులు పాల్గొన్నారు. వేడుకల్లో భాగస్వామ్యులైన వారందరికి సంప్రదాయ ఉగాది పచ్చడి, ప్రసాదం పంపిణి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement