ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేసిన కాంగ్రెస్‌తో చంద్రబాబు కలవడం దారుణమన్నారు. మరోసారి చంద్రబాబు ప్రజల చెవిలో పూలు పెడుతున్నారని మండిపడ్డారు. తమ అధినేత వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై సీఎం అవహేళనగా మాట్లాడారని, ఈ ఘటన నుంచి తప్పించుకోవడానికే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఈ హత్యాయత్నాన్ని చిన్నదిగా చూపే ప్రయత్నం చేశారన్నారు.