జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ ప్యాకేజీ తీసుకొని నారా లోకేష్‌పై పోటీ చేయకుండా మంగళగిరి సీటును సీపీఐకి కేటాయించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారప్రతినిధి ఆళ్ల రామకృష్ణ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా టీడీపీ.. పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంగళగిరిలో సర్వేల పేరిట కోడ్ ఉల్లంఘన జరుగుతోందన్నారు.