2013 భూసేకరణ చట్టానికి సవరణ చేస్తూ రైతుల పొట్టకొట్టే చట్టాన్ని చంద్రబాబు నాయుడు తీసుకువస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి మండిపడ్డారు. దేశంలో మొదటిసారి భూ ఆక్రమణ చట్టాన్ని చంద్రబాబు తెస్తున్నారని విమర్శించారు. ఆయన మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలో ఏ నాయకుడు ఇంతటి దుర్మార్గ చట్టాన్ని తేలేదన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్య వాదులందరూ ఈ చట్టాన్ని అడ్డుకోవాలని కోరారు.