జిల్లా వ్యాప్తంగా జ్వరాలతో 86 మంది చనిపోయినా సీఎం చంద్రబాబు నాయుడు చలించలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఒక్క సాలూరులోనే జ్వరాలతో 21 మంది చనిపోయారని, కలసా గ్రామంలో నెలరోజుల్లో 11 మంది చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 291వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన చంద్రబాబు పాలన తీరును చీల్చి చెండాడారు. ఈ సభలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..