కృష్ణా కరకట్టపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం పక్కన అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయాలని కలెక్టర్ల సమావేశ వేదిక నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాలపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు స్వయంగా అక్రమ కట్టడంలో నివాసం ఉండడమే కాకుండా అధికారంలో ఉండగా దానిపక్కనే నిబంధనలకు విరుద్ధంగా మరో భవనాన్ని నిర్మించడంపై ప్రతిపక్షాలు ఆందోళనలు చేసినా లెక్క చేయలేదు. పర్యావరణవాదుల అభ్యంతరాలను బుట్టదాఖలు చేశారు.