సీఎం చంద్రబాబు నాయుడుకు తన ఐదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిపై ఓటు అడిగే ధైర్యం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే.. రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ స్కూల్ కూడా ఉండదని తెలిపారు. ఇప్పటికే ఆరు వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని గుర్తుచేశారు. చంద్రబాబుకు ఓటేస్తే.. ఎల్‌కేజీకి లక్ష రూపాయలు, ఇంజనీరింగ్‌కు 5లక్షల రూపాయలు కట్టాల్సి వస్తుందన్నారు.