‘మా నాన్న బతికి ఉన్నంతవరకు నా మీద కేసుల్లేవు. మా నాన్న చనిపోయిన తర్వాత ఓదార్పుయాత్ర చేస్తానని నేను ప్రకటించగానే.. నాపై కేసులు పెట్టారు. నా మీద కేసులు పెట్టినవారెవరో తెలుసా? టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు.. కాంగ్రెస్ పార్టీ నుంచి నేను బయటకు రాగానే.. ఆ రెండు పార్టీలు కలిసి నాపై కేసులు పెట్టాయి. మా నాన్న సంక్షేమ పాలన చూసి ఆ పార్టీ నేతలు భయపడ్డారు.