ఇండియా టుడే 18వ ఎడిషన్ క్లాన్‌క్లేవ్‌లో వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన మీరు.. ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటే మళ్లీ కాంగ్రెస్‌లో చేరుతారా? అని జర్నలిస్ట్ రాహుల్ కన్వల్ ప్రశ్నించగా.. కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఎప్పుడో తుడిచిపెట్టుకుపోయిందని, ఆ పార్టీ అవసరం తమకు లేదని, ఉంటే తమ అవసరమే ఆ పార్టీకి ఉండవచ్చునని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.