కృష్ణాజిల్లా పెనమలూరులో నడిరోడ్డుపై విద్యార్థులు గురువారం బీభత్సం సృష్టించారు. పెనమలూరు పోలీస్ స్టేషన్ ఎదురుగానే విద్యార్థులు రెండు వర్గాలుగా ఏర్పడి పరస్పరం దాడులకు దిగారు. నడిరోడ్డుపై కర్రలు, రాళ్ళతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఇద్దరు విద్యార్థుల తలలు పగిలాయి. రాళ్ళు రువ్వుతూ భయానక వాతావరణం సృష్టించడంతో పెనమలూరు పోలీస్ స్టేషన్ బయట వున్న సెంట్రీలు సైతం స్టేషన్ లోకి పరుగులు తీశారు. చుట్టూ పక్కల నివాసాల వారు భయంతో తలుపులు వేసుకుని ఇళ్ళలోనే వుండిపోయారు.ఈ మొత్తం వ్యవహారంను చిత్రీకరిస్తున్న మీడియా రెండు గ్యాంగ్లోని విద్యార్థులు కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ మీడియా కెమేరా ద్వంసం కాగా, ఇద్దరు మీడియా ప్రతినిధులకు దెబ్బలు తగిలాయి. పోలీస్ స్టేషన్ ఎదురుగానే బీభత్సకాండ జరుగుతున్నా, స్టేషన్ నుంచి పోలీసులు బయటకు రాకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నడిరోడ్డుపై భయానక వాతావరణం..
Feb 22 2018 7:23 PM | Updated on Mar 22 2024 10:48 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement