దారుణం : గాడిదల్ని దొంగలించారని... | Watch, 3 Dalits Thrashed Over Donkey Theft In Rajasthan | Sakshi
Sakshi News home page

దారుణం : గాడిదల్ని దొంగలించారని...

Feb 23 2020 6:47 PM | Updated on Mar 21 2024 8:24 PM

జైపూర్‌ : నాగౌర్‌లో దళిత అన్నదమ్ములపై దాటి ఘటన మరువక ముందే రాజస్తాన్‌లో మరో ఘటన కలకలం రేపింది. గాడిదలను దొంగతనం చేశారనే అనుమానంతో  ముగ్గురు దళితులను చితకబాదారు. ఈ సంఘటన రాజస్తాన్‌లోని జైసల్మీర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసు తెలిపిన వివరాల మేరకు.. జైసల్మీర్‌లో ఈ నెల 15న గాడిదలను దొంగతనం చేశారనే అనుమానంతో ఓ ముగ్గరు దళితులను కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా చితకబాదారు. కర్రలతో, కాళ్లతో కొడుతూ దారుణంగా ప్రవర్తించారు.

ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు ఈ శనివారం వైరల్‌ కావటంతో ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితులు ఎటువంటి ఫిర్యాదు చేయకపోయినప్పటికి, వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలింపు చేపట్టారు.
 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement