తిరుమలలో మరో ఇద్దరు దళారుల అరెస్ట్‌ | Vigilance Officers Arrested Two Brokers In Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో మరో ఇద్దరు దళారుల అరెస్ట్‌

Nov 2 2019 5:07 PM | Updated on Mar 22 2024 11:30 AM

తిరుమలలో మరో ఇద్దరు దళారులను విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. 17 వేల రూపాయలకు రెండు సుప్రభాతం సేవా టిక్కెట్లను విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. దళారులలో ఒకరు టీటీడీ ఉద్యోగి మధుసూదన్ కాగా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. ప్రజా ప్రతినిధులు సిఫార్సు లేఖలతో టిక్కెట్లు పొంది భక్తులకు విక్రయిస్తున్నారని విజిలెన్స్‌ అధికారులు వెల్లడించారు. టిక్కెట్లు లేకుండానే భక్తులను విఐపి బ్రేక్‌ దర్శనాలకు అనుమతిస్తునట్లు పోలీసులు గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement