మెట్రో పిల్లర్‌ను ఢీకొన్న బైక్,ముగ్గురు మృతి | Three killed due to bike hits divider in mettuguda | Sakshi
Sakshi News home page

మెట్రో పిల్లర్‌ను ఢీకొన్న బైక్,ముగ్గురు మృతి

Nov 20 2018 9:56 AM | Updated on Mar 22 2024 10:55 AM

నగరంలోని మెట్టుగూడలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన బైక్‌ మెట్టుగూడలోని మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన స్థలానికి చేరుకున్న లాలాగూడ పోలీసులు మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతులను ఉదయ్‌, పృథ్వీ, ఉదయ్‌రెడ్డిలుగా గుర్తించారు.

ఉప్పల్‌ నుంచి సికింద్రాబాద్‌ వైపు బైక్‌పై(నంబర్‌ టీఎస్‌08 ఎఫ్‌టీ 6841) వెళ్తున్న యువకులు మెట్టుగూడ వద్ద మూలమలుపును సరిగా అంచనా వేయకలేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. అతి వేగం కారణంగానే ప్రమాదం చోటుచుసుకుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. మృతి చెందిన యువకులను సూర్యాపేట జిల్లాకు చెందినవారిగా గుర్తించారు.  

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement