‘17 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరేందుకు సిద్ధం’ | TDP MLAs Wants To Join In YSRCP Says Sajjala Ramakrishna Reddy | Sakshi
Sakshi News home page

‘17 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరేందుకు సిద్ధం’

Jan 26 2020 4:09 PM | Updated on Mar 21 2024 7:59 PM

టీడీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల్లో 17 మంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. టీడీపీ ఎమ్మెల్సీల పరిస్థితి కూడా అలానే ఉందని పేర్కొన్నారు. వాళ్లందరినీ తీసుకుని తామేం చేయాలని అన్నారు. అయినా, ​కోట్లు పెట్టి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొనాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. డబ్బులు ఇచ్చి రాజకీయాలు చేయాల్సిన అవసరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి లేదని తెలిపారు. సీఎం జగన్‌ నవతరం నాయకుడైతే.. చంద్రబాబు నాయుడు అంతరించిపోతున్న నాయకుడని వ్యాఖ్యానించారు. పార్టీ కార్యాలయంలో రామకృష్ణారెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement