‘‘ఐదేళ్ల నుంచి ఇదే బతుకు. తోపుడు బండి నుంచి పరిశ్రమల వరకూ ప్రతి దానికీ ‘కె’ ట్యాక్స్ వేస్తున్నారు. ఈ అక్రమ ట్యాక్స్‌లు కట్టడం మా వల్ల కాదు. కోడెల అధికారంలో.. దూడల పెత్తనంతో మా పరిస్థితి దారుణంగా మారింది. కుక్కను నిలబెట్టినా గెలిపించేందుకు కృషి చేస్తాం గానీ కోడెలకు మాత్రం ఓటేయలేం’’ అంటూ గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ నాయకులు తేల్చిచెప్పారు.