కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మాకు ఎవరి మద్దతు అవసరం లేదని బీజేపీ సీనియర్ నేత సదానంద గౌడ తెలిపారు. మంగళవారం ఆయన ఫలితాల్లో బీజేపీ అధిక్యం సాధించడంపై ఆనంద వ్యక్తం చేస్తూ.. మీడియాతో మాట్లాడారు. ఫలితాల్లో ఇప్పటికే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ (112) దాటేసిందని, ఇప్పడు బీజేపీకి ఎలాంటి కూటములు అవసరం లేదని పేర్కొన్నారు.