షాపుకు నిప్పు పెట్టబోయి.. | Rowdy sheeter Naveen yadav injured in explosion in alwal,Hyderabad | Sakshi
Sakshi News home page

షాపుకు నిప్పు పెట్టబోయి..

Jun 13 2018 11:41 AM | Updated on Mar 21 2024 9:00 PM

నెల మామూళ్లు ఇవ్వనందుకు గోదాంపై పెట్రోల్‌పోసి నిప్పంటించిన యువకుడు ఆదే మంటల్లో గాయపడి ఆసుపత్రిలో ప్రాణపాయ స్థితిలో  చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అల్వాల్‌కు చెందిన శ్యామ్‌ స్థానిక జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ కార్యాలయం సమీపంలో ఎంబి సౌండ్స్‌ పేరుతో శుభకార్యాలకు డెకరేషన్, లైట్లు, జనరేటర్లను అద్దెకు ఇచ్చే వ్యాపారం నిర్వహిస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం గోదాంలో నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో అదే ప్రాంతానికి చెందిన నవీన్‌యాదవ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైర్‌ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన నవీన్‌ను చికిత్స నిమిత్తం పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement