ముస్లింలలో అపోహలు రేకెత్తించడానికి, తద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందడానికి కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని కేంద్ర విద్యుత్ ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ ఆరోపించారు. ప్రజలు వారి ఉచ్చులో పడవద్దని కోరారు. విశాఖపట్నంలోని బీజేపీ కార్యాలయంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై అపోహలు తొలగించేందుకు తయారు చేసిన కరపత్రాన్ని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ ఆదివారం విడుదల చేశారు.