తిరుపతి నుంచి నిజామాబాద్ వస్తున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్ శనివారం ఉదయం ఇందల్‌వాయ్ మండలం సిర్నాపల్లి వద్ద పట్టాలు తప్పింది. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు అందరూ క్షేమంగా ఉన్నారు. కాగా బీ1 ఏసీ బోగా ఒక్కటే పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో అర కిలోమీటర్ వరకూ ట్రాక్ ధ్వంసం అయింది.