పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమైన 10 నిమిషాల్లోనే వాయిదా పడ్డాయి. రాజ్యసభ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడగా... లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. ఏపీకి ప్రత్యేక హోదా , బడ్జెట్ విషయాలపై రాజ్యసభ దద్దరిల్లింది. బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు సరిగా జరుగలేదని.. ఏపీ ప్రత్యేక హోదాపై సభలో చర్చ జరుగాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు పోడియం వద్దకు వెళ్లి కాంగ్రెస్, వైసీపీలు నిరసన వ్యక్తంచేశారు. బడ్జెట్‌లో ఏపీకి తీవ్రమైన అన్యాయం జరిగిందని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ ఆందోళన వ్యక్తంచేశారు.
Feb 5 2018 12:05 PM | Updated on Mar 21 2024 9:02 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement