రఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణమంత్రి నిర్మలా సీతారామన్, అనీల్ అంబానీలపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రఫెల్ కుంభకోణంలో మోదీ పాత్ర ఉందని నిరూపితం అయిందని ఆయన అన్నారు. ఈ అంశంపై ప్రధాని మోదీతో పాటు నిర్మలా సీతారామన్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనన్నారు.