చెప్పు తిని దొరికిపోయింది...చివరికి! | Python Was Caught After It Swallowed Slipper, In Australia | Sakshi
Sakshi News home page

చెప్పు తిని దొరికిపోయింది...చివరికి!

Mar 27 2018 8:52 PM | Updated on Mar 22 2024 11:04 AM

దాదాపు పది అడుగుల పొడవాటి ఓ కొండ చిలువ (పైథాన్‌) ఇంట్లోకి ప్రవేశించడంతో జనం భయంతో పరుగులు తీశారు. ఈ సంఘటన సోమవారం పెర్త్‌లోని మౌంట్‌ ఒమానెయ్‌లో చోటుచేసుకుంది. దానిని పట్టుకునేందుకు స్థానికంగా ఉండే పాములు పట్టే వ్యక్తికి సమాచారమివ్వగా..అతను వచ్చేసరికే పాము చెట్టు కొమ్మల్లోకి చేరింది.  అయితే ఎలాగోలా దాన్ని పట్టుకున్న ఆ వ్యక్తి దాని కడుపులో ఏదో వస్తువుందని గ్రహించి వెటర్నరీ ఆస్పత్రి హెర్ప్‌ వెట్‌కు తరలించాడు. ఆ పైథాన్‌ను స్కాన్‌ చేయగా దాని కడుపులో చెప్పు ఉందని తేలింది. సర్జరీ చేసి దాని పొట్టలో నుంచి చెప్పును తొలగించారు. ఆపరేషన్‌ జరిగిన తీరును వీడియో తీసి వైద్యుడు జాన్‌ లీనాస్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా అది వైరల్‌ అవుతోంది. కావాలంటే మీరూ చూడొచ్చు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement