వైరల్ అవుతున్న అభినందన్ ఫేక్ వీడియో!
కొందరు ఫేక్ రాయుళ్లు తమ క్రీయేటివిటీకి పదునుపెట్టారు. కరాచీకి చెందిన టీ కంపెనీ 'తాపల్' వాణిజ్య ప్రకటనను మార్ఫ్ చేసి అభినందన్ మాటలను జోడించి సోషల్ మీడియాలో పెట్టారు. ఇది నిజమేమోనని భావించి తాపల్ వాణిజ్య ప్రకటనలో అభినందన్ నటించారంటూ.. పాక్, భారత్‌లో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ ప్రకటనకు తమ సంస్థకు ఎలాంటి సంబంధంలేదని తాపల్ సిబ్బంది చెబుతున్నా, అప్పటికే వీడియో తెగ చక్కర్లు కొట్టడంతో ఇప్పుడా టీ బ్రాండ్ పేరు పాకిస్తాన్, భారత్‌లో మారుమోగిపోతుంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి