డిగ్రీ విద్యార్థినిపై పెట్రోల్‌ దాడి | Petrol Attack On Degree Student In Warangal | Sakshi
Sakshi News home page

డిగ్రీ విద్యార్థినిపై పెట్రోల్‌ దాడి

Feb 27 2019 10:20 AM | Updated on Mar 21 2024 11:34 AM

వరంగల్‌లో దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమను నిరాకరించిందనే కారణంతో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. తోటి విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వివరాలు... రవళి అనే యువతి వాగ్దేవి కాలేజీలో డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. ఆమె స్వస్థలం సంగెం మండలం రామచంద్రాపురం. ఈరోజు(బుధవారం) కాలేజీకి వెళ్తున్న సమయంలో.. సాయి అన్వేష్‌ అనే యువకుడు ఆమెపై పెట్రోల్‌తో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమెను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రవళి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement