దాచేపల్లి ఘటన: మిన్నంటుతున్న నిరసనలు | People protest in guntur over Dachepalli incident | Sakshi
Sakshi News home page

దాచేపల్లి ఘటన: మిన్నంటుతున్న నిరసనలు

May 3 2018 12:59 PM | Updated on Mar 20 2024 3:11 PM

తొమ్మిదేళ్ల బాలికపై 55 ఏళ్ల కామాంధుడు అత్యాచారం చేశాడు. చాక్లెట్లు కొనిస్తానని తీసుకెళ్లి లైంగిక దాడి చేసినట్టు సమాచారం. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉంది. గుంటూరు దాచేపల్లిలో జరిగిన ఈ దారుణంపై స్థానికులు మండిపడుతున్నారు. వారి ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. దాచేపల్లిలో బాలికపై అత్యాచార ఘటనకు నిరసనగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. మాచర్లలో ముస్లింలు ఆందోళన చేశారు. రోడ్డుపై రాస్తారోకో చేశారు. టైర్లు తగలబెట్టి నిరసన తెలిపారు. నిందితుడు సుబ్బయ్యను వెంటనే అరెస్ట్‌ చేయాలని... ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement