జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు భారీ షాక్ తగిలింది. పవన్ అత్యంత సన్నిహితుడు, జనసేన పొలిట్ బ్యూరో సభ్యుడు రాజు రవితేజ్ పార్టీకీ గుడ్‌బై చెప్పారు. ఇకపై పవన్‌తో కానీ, జనసేన పార్టీతో కానీ తనకు ఎలాంటి సంబంధం ఉండబోదని స్పష్టం చేశారు. పవన్ ప్రవర్తన నచ్చకనే పార్టీని వీడుతున్నాని తెలిపారు. ఈమేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘పార్టీ భావజాలం, రాజ్యాంగాన్ని సృష్టించి, పార్టీని ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించాను. జనసేన మెదటి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాను.