నంద్యాల టీడీపీలో వర్గపోరు మరోసారి బయటపడింది. మంత్రి అఖిల ప్రియ చుట్టు అసమ్మతి రాగాలు ఎక్కువ కావటంతో ఆళ్లగడ్డ రాజకీయం మరోసారి వేడెక్కింది. మంత్రి అఖిలప్రియ, టీడీపీ సీనియర్ నేత, దివంగత భూమా నాగిరెడ్డి ప్రధాన అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డికి మధ్య కోల్డ్‌వార్ మళ్లీ తెరమీదకు వచ్చింది. భూమా వర్థంతికి తనకు పిలుపు రాలేదని మంత్రి అఖిల ప్రియపై తీరుపై సుబ్బారెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.