తెలంగాణ మంత్రి జోగు రామన్న తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసిన అనంతరం ఓ భూమిపూజ కార్యక్రమానికి హాజరైన ఆయన అనూహ్యంగా చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మంచిర్యాలలో మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహ శంకు స్థాపనకు మంత్రి జోగు రామన్న, విప్ ఓదేలు, ఎమ్మెల్యే దివాకర్‌రావు ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలకు హాజరయ్యారు.