కాంగ్రెస్,టీడీపీ పార్టీల 60 ఏళ్ల పాలనలో పాలమూరు జిల్లాను కరువు జిల్లాగా, ఆత్మహత్యల జిల్లాగా మార్చడమే కాకుండా వలసల జిల్లాగా మార్చారని ఆపధర్మ సీఎం, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ పార్టీ, తెలంగాణ ప్రజలు 18 ఏళ్లు పొరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, పొరాడి తెచ్చుకున్న తెలంగాణను మనమే పాలించుకోవాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు.