20 ఏళ్లలో భారత్‌ వేగంగా అభివృద్ది చెందింది | India's GDP in 1997 was $400 bn, today it's six times bigger, says PM | Sakshi
Sakshi News home page

20 ఏళ్లలో భారత్‌ వేగంగా అభివృద్ది చెందింది

Jan 23 2018 5:13 PM | Updated on Mar 20 2024 1:57 PM

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ గత 20 ఏళ్లలో భారత్‌ వేగంగా అభివృద్ది చెందిందన్నారు. 1997లో 400 బిలియన్‌ డాలర్లుగా ఉన్న భారత జీడీపీ ప్రస్తుతం ఆరు రెట్లు పెరిగిందన్నారు. సాంకేతికత అన్ని రంగాల్లో ప్రభావం చూపుతున్నదని, దీన్ని ప్రపంచం అందిపుచ్చుకోవాలని పిలుపు ఇచ్చారు. దావోస్‌ వేదికపై 20 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ప్రసంగించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. వసుధైక కుటుంబ భావనను భారత్‌ విశ్వసిస్తుందని మోదీ ఉద్భోదించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement