మామిడిని రసాయనాల భూతం వీడటం లేదు. హైకోర్టు ఆదేశాలతో కాల్షియం కార్బైడ్ విని యోగం నియంత్రణలోకి వచ్చినా ప్రత్యామ్నాయంగా ప్రమాదకర ఇథెఫాన్ మిశ్రమం వినియోగం పెట్రేగిపోతోంది. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఇథెఫాన్ మిశ్రమం పొట్లాలను నీటిలో తడిపి మామిడి పండ్లపై వేసి కృత్రిమంగా మాగబెడుతున్నారు.