కన్నడనాట హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని ఇండియాటుడే–కార్వీ ఒపీనియన్ పోల్‌లో వెల్లడైంది. అధికార కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అందుకోకపోయినా అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని సర్వే తెలిపింది. 225 మంది ఎమ్మెల్యే (ఒక నామినేటెడ్ ఆంగ్లో సాక్సన్)లున్న కన్నడ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు 113 సీట్లు కావాలి. అయితే కాంగ్రెస్ 90–101 స్థానాల్లో, బీజేపీ 78–96 చోట్ల గెలిచే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. బీఎస్పీతో చేతులు కలిపిన జేడీ (ఎస్) 34–43 స్థానాల్లో గెలిచి ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానుందని సర్వేలో తేలింది. అటు సీఎంగా సిద్దరామయ్యకే 33 శాతం మంది ఓకే చెప్పగా.. యడ్యూరప్పకు 26 శాతం, కుమారస్వామికి 21 శాతం మంది మద్దతిచ్చారు.
అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్
Apr 14 2018 7:12 AM | Updated on Mar 22 2024 11:16 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement