శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు.. కత్తి మహేష్‌ అరెస్ట్‌ | Hyderabad Cyber ​​Crime Police Arrested Mahesh Kathi | Sakshi
Sakshi News home page

శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు.. కత్తి మహేష్‌ అరెస్ట్‌

Aug 14 2020 2:52 PM | Updated on Mar 21 2024 8:24 PM

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్‌ సినీ విశ్లేషకుడు‌ కత్తి మహేష్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్‌ మీడియాలో శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలతో పోస్టు చేసినందుకుగాను ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వైద్యపరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి.. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఐపీఎస్‌ సెక్షన్‌ 153(ఎ​) కమ్యూనల్‌ యాక్ట్‌ కింద సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.  గతంలోనూ అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్‌ నగర బహిష్కరణకు గురైన సంగతి తెలిసిందే. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement