కారుణ్య మరణంపై సంచలన తీర్పు | Sakshi
Sakshi News home page

కారుణ్య మరణంపై సంచలన తీర్పు

Published Fri, Mar 9 2018 4:18 PM

కారుణ్య మరణంపై సుప్రీంకోర్టు శుక్రవారం సంచలనాత్మక తీర్పు వెలువరించింది. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతూ మరణం అంచుల వద్ద ఉన్న వారికి ప్రాణాన్ని నిలబెట్టే వ్యవస్థను తీసివేయడం ద్వారా మరణాన్ని ప్రసాదించే కారుణ్య మరణాన్ని (పాసివ్‌ యుతనేసియా) అనుమతించింది. గౌరవంతో మరణించే హక్కు మానవులకు ఉందని మార్గదర్శకాలతో కారుణ్య మరణాలను అనుమతించవచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.