హీరా గోల్డ్ ఛైర్మన్ షేక్ నౌహీరా భేగం మంగళవారం సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్కువ శాతం వడ్డీ చెల్లిస్తామని వినియోగదారులకు ఎర వేస్తూ హీరా గోల్డ్ దేశవ్యాప్తంగా వందల కోట్లు డిపాజిట్లు సేకరించింది. హైదరాబాద్, తిరుపతి బెంగళూరు, ముంబైలతో పాటు పలు రాష్ట్రాల్లో హీరాగోల్డ్ పై కేసులు నమోదు అయ్యాయి.