కల్యాణదుర్గం టీడీపీలో టికెట్ల పంచాయతీ కొనసాగుతుండటంతో.. పార్టీ అభ్యర్థిని ప్రకటించకముందే సిట్టింగ్ ఎమ్మెల్యే రెబల్‌గా బరిలోకి దిగారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. టికెట్ ఖరారు కాకముందే నామినేషన్ వేయడంపై ఆయన వ్యతిరేక వర్గం భగ్గుమంటుంది. హనుమంతరాయ చౌదరి క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు.