మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శనివారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. సర్వతే బస్టాండ్ సమీపంలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలి 10 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు.